Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ముక్త్ పింద్ అభియాన్ : ప్రతి గ్రామానికి రూ.10 లక్షల గ్రాంటు

Webdunia
బుధవారం, 19 మే 2021 (10:41 IST)
కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ప్రోత్సిహిస్తుంది. ముఖ్యంగా, కరోనా ముప్పు నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేవి అప్రమత్తత, వ్యాక్సినేనని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. 
 
కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేందుకు సమాయత్తమవుతోంది. 
 
ఇందులోభాగంగా ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ‘కరోనా ముక్త్‌ పింద్‌ అభియాన్‌’ పేరిట ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును ప్రకటించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేలా 100 శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్నిసాధించిన ప్రతి గ్రామాలకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల చొప్పున గ్రాంటు ఇవ్వనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, టీకా కొరత వేధిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగానే కొనసాగుతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ మరికొన్ని రోజుల్లో వస్తే ఈ కార్యక్రమం వేగం పుంజుకొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments