పవన్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా.. హోం క్వారంటైన్‌లో వకీల్ సాబ్

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (15:09 IST)
జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యక్తిగ‌త సిబ్బందిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధతిలోనే జ‌న‌సేన‌ పార్టీ కార్య‌క‌లాపాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
 
త్వ‌ర‌లోనే తిరుప‌తి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ స్థానంలో పోటీకి బీజేపీ - జ‌న‌సేన త‌ర‌పున అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ పోటీ చేస్తున్నారు. 
 
ఎన్నికలకు ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ సిబ్బందిలో కొంద‌రు క‌రోనా బారిన ప‌డ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్  తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని నెగ‌టివ్ అని తేలితే మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షంగా ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొనే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments