Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆశలు రేపుతున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ - సైడ్ ఎఫెక్ట్స్ నిల్...

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (09:02 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుకనిపెట్టేందుకు అనేక ప్రపంచ దేశాల్లో వివిధ రకాల పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి. ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ కనుగొనేందుకు పలు దేశాలు ప్రయోగాలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాల్లో అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, భారత్‌లోని బయోటెక్ ఫార్మా కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ అన్నింటికంటే ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి. 
 
యాంటీబాడీలతో పాటు ఇమ్యూనిటీకి దన్నుగా నిలిచే టి-కణాలు కూడా మెండుగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరిలోనూ రియాక్షన్ కనిపించలేదని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌తో వ్యక్తుల్లోని ఇమ్యూనిటీ చైతన్యం పుంజుకుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments