Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల్లో కరోనా.. లక్షణాలు బయటకు కనబడవట..!

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:12 IST)
కరోనా విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాదాపు 30శాతం మంచి చిన్నారుల్లో కరోనా సోకినా కూడా వ్యాధి లక్షణాలు కనిపించట్లేదని ఇటీవల కెనడాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
కెనడాకు చెందిన మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా బారిన పడ్డ మొత్తం చిన్నారుల్లో వ్యాధి సోకినట్టు రుజువైన వారి శాతం తక్కువన్న విషయాన్ని ఈ అధ్యయనం రుజువు చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రజల ఆరోగ్య పరంగా ఇది పెద్ద సమస్యే.. కరోనా వైరస్ తమ మధ్యే వుందనే విషయం అనేక మంది గుర్తించలేరని యూనివర్శిటీ ఆఫ్ ఆల్బర్టాలో వైద్య విద్య ఫాకల్టీ ఫిన్‌లే మెకాలిస్టర్ వ్యాఖ్యానించారు. 'ఇప్పటి వరకూ ఉన్న సమచారం ప్రకారం.. పిల్లల కంటే పెద్దల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. కానీ కరోనా సోకిన చిన్నారుల వల్ల కొంత రిస్క్ ఉంది' అని మెకాలిస్టర్ స్పష్టం చేశారు.
 
కెనడా, ఆల్బర్టాల్లో మొత్తం 2463 మంది కరోనా సోకిన చిన్నారులను అధ్యయనం చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. ఈ పరిణామాల దృష్ట్యా స్కూళ్లను దీర్ఘ కాలం పాటు మూసి ఉంచడం సబబేనని మెకాలిస్టర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments