Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 101కు చేరిన ఒమిక్రాన్ కేసులు - ఢిల్లీలోనే 10

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (17:40 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్రవైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఒమిక్రాన్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. అందువల్ల అనవసర ప్రయాణాలు తక్షణం ఆపేయాలని ఆయన కోరారు. అలాగే, సామూహిక సమావేశాలు రద్దు చేసుకోవాలని సూచించారు. పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్‌రామ్ భారగ్ తెలిపారు. 
 
అంతేకాకుండా యూరప్ దేశాల్లో భారీ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనీ, అందువల్ల అక్కడ కొత్త దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి శాంపిల్‌న జీనోమ్ సీక్వెన్సింగ్ సాధ్యంకాదని, అయితే వ్యూహాత్మక రీతిలో శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ వైరస్‌‍ను 91 దేశాల్లో గుర్తించినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, గురువారం ఏకంగా 85 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే, ఈ నెల 5వ తేదీన ఒమిక్రాన్ తొలి కేసు వెలుగు చూడగా, ఇప్పటికీ ఈ కేసుల సంఖ్య పదికి చేరింది. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలోనే ఈ వైరస్‌ను అధికంగా గుర్తించినట్టు ఆరోగ్య మంత్ర సత్యేందర్ జైన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments