Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధారావిలో కరోనా కేసులు నిల్.. జనవరిలో రెండోసారి జీరో కేసులు

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (21:11 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో గత 24గంటల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని అధికారులు బుధవారం తెలిపారు. జీరో కేసులు జనవరిలో రెండోసారి అని, నగరంలో కరోనా వ్యాప్తి చెందిన అనంతరం మూడోసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22న ఎలాంటి వైరస్ కేసులు నిర్ధారణ కాలేవు. గతేడాది డిసెంబర్‌ 25న కూడా ఒక్క కేసు సైతం నమోదు కాలేదు. 
 
ప్రస్తుతం ధారావిలో కేస్‌లోడ్‌ 3,911 కు చేరగా.. ఇప్పటి వరకు 3585 మంది కోలుకొని దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 14 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ మురికివాడలో తొలి కరోనా కేసు గత ఏడాది ఏప్రిల్ 1న నమోదైంది. 
 
ముంబైలో ఫస్ట్‌ కొవిడ్‌ కేసును గుర్తించిన దాదాపు 20 రోజుల తర్వాత ఇక్కడ ఓ వ్యక్తి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 6.5లక్షలకుపైగా జనాభా ఉండగా.. ఆసియాలోనే అతిపెద్ద మురికవాడగా నిలిచింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments