Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ ఎఫెక్టు... ఊపిరి పీల్చుకున్న ముంబై... కొత్త కేసులు 4 వేలే

Webdunia
సోమవారం, 3 మే 2021 (08:52 IST)
గత కొన్ని రోజలుగా ముంబై మహానగరాన్ని వణికించిన కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి లాక్డౌన్ పుణ్యమాన్ని కాస్త శాంతించింది. నగరంలో లాక్డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదివారం ముంబైలో కొత్తగా 3,629 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 73 మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు.
 
ఇప్పటివరకూ ముంబైలో 6.55 లక్షల మందికిపైగా కరోనా సోకగా, 13 వేల మందికిపైగా మరణించారు. మొత్తం మహారాష్ట్రలో 47.22 లక్షలకుపైగా కేసులు రాగా, 70 వేల మందికిపైగా చనిపోయారు. 
 
ఇక, ఆదివారం కరోనా నుంచి 51,356 మంది కోలుకోవడంతో, ఆసుపత్రుల్లో సైతం వేలాది బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. రికవరీ రేటు 84.31 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
ప్రస్తుతం మహారాష్ట్రలో 6.68 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక, కరోనా టీకాలను ప్రస్తుతానికి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికే ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్న బీఎంసీ అధికారులు, 45 ఏళ్లు పైబడిన వారు టీకాల కోసం రావద్దని సూచించారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా మహారాష్ట్రను కరోనా వైరస్ కుదిపేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, పూణె, నాగ్‌పూర్, అమరవాతి వంటి పట్టణాల ప్రజలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోయారు. దేశంలోనే నమోదయ్యే కరోనా కేసుల్లో 50 శాతం కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతూ వచ్చాయి. దీంతో కఠిన ఆంక్షలతో లాక్డౌన్‌ను అమలు చేయడంతో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments