Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కొత్త వేరియంట్ల స్వైర విహారం : ఆమెకు 3సార్లు కోవిడ్

Mumbai Doctor
Webdunia
బుధవారం, 28 జులై 2021 (08:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కోవిడ్ కొత్త వేరియంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రీఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలికి 13 నెలల వ్యవధిలో మూడుసార్లు కొవిడ్ వైరస్ సోకింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలే వెల్లడించారు.  
 
డాక్టర్ సృష్టి హళ్లారి ముంబైలోని వీర్ సావర్కర్ ఆస్పత్రిలో కొవిడ్ కేర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు గతేడాది జూన్ 17న మొదటిసారి వైరస్‌ సోకింది. ఆ సమయంలో ఆమెలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే కనిపించాయి. 
 
ఆ తర్వాత ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఆమెతో సహా కుటుంబం అంతా రెండు డోసుల టీకా తీసుకున్నారు. సరిగ్గా నెలరోజులకు మే 29న ఈ వైద్యురాలు రెండోసారి వైరస్ బారినపడ్డారు. అప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. ఇక మూడోసారి జులై 11న ఆమెకు మళ్లీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈసారి ఆమెతో పాటు కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని సృష్టి వెల్లడించారు. 
 
ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, 'నేను మూడోసారి కరోనా బారినపడ్డాను. ఈసారి వైరస్ తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నాతో సహా కుటుంబమంతా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. మాకు రెమ్‌డెసివిర్ వాడాల్సిన పరిస్థితి ఎదురైంది. మా అమ్మ, సోదరుడికి మధుమేహం ఉంది. మా నాన్నకు బీపీ, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. నా సోదరుడికి శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో రెండురోజుల పాటు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది' అని ఆమె తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments