Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కల్లోలం.. 24గంటల్లోనే 3,300 మంది కరోనాతో మృతి

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:01 IST)
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజు లోనే దాదాపు 3,300 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో 3 వేల కరోనా మరణాలు ఎప్పుడూ నమోదుకాలేదు. దేశంలో కొత్తగా 3వేల 285 కరోనా మరణాలు సంభవించాయి.
 
దీంతో కొవిడ్‌తో ఇప్పటిదాకా భారత్‌లో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనా మరణ మృదంగం సృష్టిస్తోన్న బ్రెజిల్‌లో కంటే నిన్న భారత్‌లోనే కరోనాతో ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఒక్క ఏప్రిల్‌లోనే భారత్‌లో దాదాపు 32 వేలకు పైగా మంది కరోనాతో మరణించారు. ఈ ఏడు రోజుల్లోనే 20 వేల మందికిపైగా మృతి చెందారు.
 
అటు పెరుగుతోన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 3 లక్షల 62 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రి ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు ఎప్పుడు నమోదుకాలేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే రోజుకు 4లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డవడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో కరోనా కేసులు మొత్తం కోటీ 79లక్షలు దాటాయి.
 
నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2లక్షల 62వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29లక్షలు దాటేసింది. ప్రపంచంలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలుస్తోంది. కరోనా మరణాల్లో ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
 
కరోనా విజృంభణతో దేశంలోని చాలా రాష్ట్రాలు ఆంక్షలు బాట పడుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ,కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఏపీ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు, వారాంతపు లాక్ డౌన్లు అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
 
మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో కేంద్రం అలెర్ట్‌ అయింది. పాజిటివిటీ రేటు 15శాతంగా ఉన్న జిల్లాలను గుర్తించింది. దేశంలోని దాదాపు 150 జిల్లాల్లో పాజిటివిటీ శాతం అధికంగా ఉన్నట్లు తేల్చింది. ఈ 150 జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments