Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం మూసివేత-22 మంది ఉద్యోగులకు కరోనా

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (11:00 IST)
కేరళలో ఒకేరోజు 4,698 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 59,438కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,07,119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సుప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని రెండు వారాలపాటు మూసివేయనున్నారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశాలు కల్పించారు.
 
శబరిమల తీర్థయాత్రలు ప్రారంభమైన నేపథ్యంలో గురువాయూర్ దేవాలయంలో ఆన్‌లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. భక్తులకు ప్రవేశం లేకుండా గురువాయూర్ ఆలయాన్ని మూసివేసినప్పటికీ పూజారులు మాత్రం ఆలయంలో క్రమం తప్పకుండా ఏకాంతంగా పూజాదికాలు కొనసాగిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments