Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ మరణాలు మూడు రెట్లు అధికం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (15:43 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని అనేద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల గ‌త ఏడాది కాలంలో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో దశ వ్యాప్తిలోనూ ఈ వైరస్ మారణహోమం సృష్టిస్తోంది. 
 
ఈ క్రమంలో అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ కోవిడ్ డేటా ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 35 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. సుమారు 17 కోట్ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. అమెరికాలో 33.0 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. 5.88 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. ఇండియాలో 26 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 2.90 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. 
 
బ్రెజిల్‌లో కూడా మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న‌ది. బ్రెజిల్‌లో 15 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోక‌గా.. దాంట్లో 4.41 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ వ‌ల్ల సంభ‌వించిన మ‌ర‌ణాల సంఖ్య .. అధికారిక లెక్క‌ల క‌న్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. అనేక ప్ర‌పంచ దేశాలు ఇంకా ఆ మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments