Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ ఫంగస్ ఎలా వచ్చింది.. ఎందుకు సోకింది..?

Webdunia
గురువారం, 29 జులై 2021 (14:14 IST)
కరోనా వైరస్ సోకకుండా బ్లాక్ ఫంగస్ బారిన పడడం అత్యంత అరుదుగా వైద్యులు భావించారు. కానీ వైరస్ సోకకుండానే…బ్లాక్ ఫంగస్ బారిన పడడం వైద్యులను కలవరపెడుతోంది. అసలు బ్లాక్ పంగస్ వారికి ఎలా వచ్చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. 
 
కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్‌లో 3,471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అందులో 477 మందికి అసలు కరోనా వైరస్ సోకలేదని వెల్లడైంది. అంటే..మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 14 శాతం కేసులకు కోవిడ్ హిస్టరీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. 
 
అసలు ఇలా ఎందుకు జరుగుతున్నదనే దానిపై అధ్యయనం జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం అవసరం ఉన్నదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 477 మందిలో కోవిడ్ హిస్టరీ లేకపోయినా..బ్లాక్ ఫంగస్ ఎందుకు సోకిందనేదానిపై వైద్యులకు ఫజిల్ గా మారింది. 
 
డయాబెటిస్, హెచ్ఐవి ఉన్నవాళ్లలో ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు దాడి చేస్తాయని, కరోనా కారణంగా చాల మందిలో షుగర్ లెవల్స్ అదుపుతప్పుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ విజృంబించిందని జైపూర్ ఎస్ఎమ్మెస్ మెడికల్ కాలేజీ ప్రిన్స్‌పాల్ సుధీర్ భండారి వెల్లడించారు. 
 
కరోనా వైరస్ సోకిన తర్వాత.. అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించడం, డయామెటిక్ రోగుల్లో షుగర్ లెవల్స్ అదుపు తప్పడానికి దారి తీస్తుందని.. ఈ కారణంగా..బ్లాక్ ఫంగస్ సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments