ఢిల్లీలో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్ : ఆరోగ్య శాఖామంత్రి జైన్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:30 IST)
దేశ రాజధాని ఢిల్లీ మరోమారు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ కూడా క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో కొత్తగా నమోదైన 46 శాతం కేసుల్లో ఒమిక్రాన్ కేసులేనని ఆయన గుర్తుచేశారు. అందుకే ఢిల్లీలో జన్యుక్రమ విశ్లేషణ మొదలుపెట్టినట్టు చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 923 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మే 30వ తేదీ నుంచి నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments