ఢిల్లీలో కరోనాతో 25మంది పోలీసుల మృతి, ఇ -పాస్ తప్పనిసరి

Webdunia
బుధవారం, 5 మే 2021 (18:40 IST)
కరోనా వైరస్ ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది. రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 55 రోజుల్లో 25 మంది ఢిల్లీ పోలీసులు కోవిడ్-19తో మరణించారు. 
 
2021 మార్చి 11 నుంచి ఇప్పటి వరకు 4,200 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని టైమ్స్ నౌ నివేదించింది. పీసీఆర్ యూనిట్ నుంచి 441 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. 
 
మార్చి 10 వరకు ఒక సంవత్సరంలో కనీసం 7,724 మంది ఢిల్లీ పోలీసులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. మొత్తం 34 మంది పోలీసులు మరణించారు.
 
కరోనా సెకెండ్ వేవ్‌లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 10వ తేదీ వరకూ పొడిగించారు. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్‌నీత్ సెహగల్ బుధవారంనాడు ఈ మేరకు ప్రకటించారు. 
 
తాజా లాక్‌డౌన్‌తో మే 10వ తేదీ ఉదయం 7 గంటల వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు.
 
దీనికి ముందు గురువారం ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్‌ను యూపీ ప్రభుత్వం పొడిగించింది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్‌లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MM keeravani: వందేమాతరం నా జీవితలో మైల్ రాయి : కీరవాణి

సంకల్ప యాత్ర వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు : బండ్ల గణేశ్‌

రాంచరణ్ సినిమా కాకుండా.. అరుంధతి లాంటి కథపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Samantha: సమంత క్లాప్ తో చీన్ టపాక్‌ డుం డుం ఘనంగా ప్రారంభం

మగాళ్లు రేప్ చేస్తున్నారు.. వారందర్నీ పట్టుకుని చంపేద్దామా? రేణూ దేశాయ్ ప్రశ్న (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments