Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం.. ఇప్పుడే స్కూల్స్ వద్దు.. నీతి ఆయోగ్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (09:46 IST)
దేశంలో సెకండ్ కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో వెంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ రీ ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీనిపై పలువురు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే పిల్లలను బయటకి పంపడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. 
 
తాజాగా ఇదే విషయంపై స్పందించిన నీతి ఆయోగ్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్.. కరోనా అసలు పరిస్థితి ఏంటో ఇప్పటికి ఇంకా పూర్తిగా సమాచారం లేకుండా ఇప్పుడే స్కూల్స్ తెరవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఒకవిధంగా ఇది ప్రాణాలను పణంగా పెట్టడమేనన్నారు.
 
స్కూల్స్ లో విద్యార్థులు, టీచర్లు, హెల్పర్లు అందరూ ఒకేచోట ఉండాల్సి వస్తుందని.. ఇది వైరస్ వ్యాప్తికి మనమే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అందించే పెద్దవారిలో కనీసం ఎక్కువ మందికి ఇచ్చిన అనంతరం.. పిల్లలలో కొంతభాగమైనా వ్యాక్సినేషన్ ఇచ్చిన అనంతరమే స్కూల్స్ రీఓపెన్ చేయడం మంచిదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments