Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన సీరం సీఈవో ... ఏప్రిల్ 2021లో కరోనా టీకాలు!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:52 IST)
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. ఆస్ట్రాజెనికా, సీరం సంస్థలతో కలిసి ఈ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తి కట్టడి కోసం టీకాను తయారు చేస్తున్నారు. తాము అభివృద్ధి చేసిన టీకా విజయవంతమైందని సీరం సంస్థ సీఈవో అదర్ పునావాలా వెల్లడించారు. పైగా, వచ్చే యేడాది 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తొలుత వృద్ధులు, హెల్త్ వర్కర్లకు ఈ టీకాను అందజేస్తామని వెల్లడించారు. 
 
దేశ ప్రజానీకానికి మాత్రం ఏప్రిల్ నెల నుంచి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులకుగానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా సూచన ప్రాయంగా వెల్లడించారు. దీనికి కోవిషీల్డ్ అనే పేరు పెట్టిన విషయం తెల్సిందే. 
 
ఇకపోతే, తాము తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే 4 కోట్ల డోసులను సిద్ధం చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) తెలిపింది. నియంత్రణ సంస్థల నుంచి సరైన సమయంలో ఆమోదం లభిస్తే, 2021 జనవరిలోపు ఈ వ్యాక్సిన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సీఐఐ సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments