Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్ట్‌లోనే కరోనా థర్డ్ వేవ్: ఎస్‌బీఐ తాజా సర్వే

Webdunia
సోమవారం, 5 జులై 2021 (12:17 IST)
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య నాలుగు నెలల కనిష్ఠానికి దిగి వచ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది ఎస్‌బీఐ తాజా సర్వే. ఆగస్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తన తాజా నివేదికలో హెచ్చరించింది.

కోవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ తన పరిశోధన నివేదికను రూపొందించింది. ఇక కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ సెప్టెంబర్‌లో ఉంటుందనీ ఈ అధ్యయనం అంచనా వేసింది.
 
ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదు కావచ్చు. అయితే ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచనా వేసింది.
 
కరోనా థర్డ్ వేవ్ సగటు పీక్ స్టేజీ కేసులు రెండో వేవ్ పీక్ స్టేజీలో నమోదైన కేసుల కంటే 1.7 రెట్లు ఎక్కువగా ఉండనున్నట్లు గ్లోబల్ డేటా చెబుతోంది. ఆగస్ట్ రెండో పక్షంలో కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమై.. నెలలోపు పీక్ స్టేజీకి వెళ్లే చాన్స్ ఉంది. 
 
ఇక వ్యాక్సినేషన్ల విషయానికి వస్తే.. దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తున్నారు. దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు 4.6 శాతం కాగా.. 20.8 శాతం మంది తొలి డోసు వేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments