Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో దడపుట్టిస్తున్న కరోనా వైరస్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:06 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ 30వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర పెరిగాయి. 
 
వీటిలో ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3 వేల మందికి వైరస్ సోకింది. నిన్న మరో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య గణాంకాలను వెల్లడించింది.
 
దేశంలో ఇప్పటివరకు 3.35 కోట్ల మందికి కరోనా సోకగా... 3.28 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న 31 వేలమంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,01,640 మంది వైరస్‌ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఇక 4,46,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియాశీల కేసులు రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది.
 
83 కోట్ల టీకా డోసులు పంపిణీ.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగా ఉంది. నిన్న 71.38 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 83.39 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments