Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకోని కర్నూలు.. కొత్తగా 27 కరోనా కేసులు.. ఏపీలో 1000కి చేరువగా...

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (13:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలోనే ఏకంగా 27 కేసులు నమోదు కాగా, గుంటూరులో మరో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే, అనంతపురంలో నాలుగు, ఈస్ట్ గోదావరిలో రెండు, ప్రకాశంలో 3, కృష్ణా జిల్లాలో 14 చొప్పున నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 955కు చేరాయి. 
 
అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో రెండు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనాతో 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 29గా ఉంది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 781గా ఉంది. 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 6,306 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం 46, చిత్తూరు 73, ఈస్ట్ గోదావరి 34, గుంటూరు 206, కడప 51, కృష్ణ 102, కర్నూలు 261, నెల్లూరు 68, ప్రకాశం 53, విశాఖపట్టణం 22, వెస్ట్ గోదావరి 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments