Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఆ తేదీ తర్వాత కరోనా కేసులు నమోదు కావట...

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (13:29 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా, ఇప్పటికే రెండు దశల్లో లాక్‌డౌన్ అలవుతోంది. రెండో దశ లాక్‌డౌన్ మే మూడో తేదీ వరకు అమల్లోవుంది.  
 
అయితే, భారత్‌లో వైద్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ శుభవార్త చెప్పింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది.
 
ఈ కమిటీ వెల్లడించిన వివరాల మేరకు మే 3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వచ్చేనెల మే 3 నుంచి 12వ తేదీన మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయి. 
 
అనంతరం పూర్తిగా తగ్గిపోయాయి. మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేసమయం 10 రోజులకు పెరిగిందని ఈ కమిటీ పెర్కొంది. 
 
అయితే, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండడం పట్ల కొందరు నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వైరస్‌ వ్యాప్తి తక్కువుంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి.
 
మరోవైపు, కేంద్ర సాధికార కమిటీ నివేదికలో స్పష్టమైన అంశాలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సింగపూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి. 
 
భారత్‌లో కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్యతో పాటు వైరస్‌ వ్యాప్తి రేటు తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సింగపూర్‌ వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ పరిశోధకులు పలు అంచనాలు వేశారు. 
 
వారు వెల్లడించిన అధ్యయనంలో భారత్‌ జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని తేలింది. మే 21 నాటికి భారత్‌లో కరోనా తీవ్రత 97 శాతం తగ్గుతుదని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments