Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ: శ్మశాసనవాటికలో నో ప్లేస్.. పార్కింగ్ స్థలంలో అంత్యక్రియలు.. ఒక్కరోజే..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (09:52 IST)
ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 348 మంది మృతి చెందారు. వారం రోజుల క్రితం 104గా ఉన్న మరణాల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి 200కు తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. ఆ రోజు 240 మంది, మంగళవారం 277 మంది, బుధవారం 249 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
గత పదిరోజుల్లో ఏకంగా 1,750 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి యూకే స్ట్రెయినే ప్రధాన కారణమని తాజాగా వెల్లడైంది. మరోవైపు, కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఢిల్లీలోని సీమాపురి శ్మశాసనవాటికలో అంత్యక్రియలకు చోటులేక పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సామూహిక దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మొన్న ఒక్కరోజే ఇక్కడ 75 మందికి అంత్యక్రియలు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments