Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆరు లక్షలు.. అమెరికాలో ఒక్క రోజే 50వేల కేసులు

Webdunia
గురువారం, 2 జులై 2020 (10:13 IST)
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే అమెరికాలో సుమారు 50వేల కేసులు నమోదైనాయి. ఈ విషయాన్ని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీటిల్లో 1,28,061 మంది మృత్యువాత పడ్డారు. 
 
ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,15,600 దాటింది. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో బ్రెజిల్‌ 14,48,753, రష్యా 6,53,479, భారత్‌ 5,85,493, యూకే 3,14,992 ఉన్నాయి.
 
ఇక మన దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 604641కి చేరింది.
 
ఇక కరోనా నుంచి కోలుకున్న వారి 359859కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన సంఖ్య 434గా నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 17834కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments