Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా ఉగ్రరూపం - మరో 3561 కొత్త కేసులు

Webdunia
గురువారం, 7 మే 2020 (09:45 IST)
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 3561 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52952కు చేరింది. 
 
అలాగే, గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. మొత్తం 89 మంది చనిపోగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 1783కు చేరినట్టు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, గత 24 గంటల్లో దేశంలో 3,561 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం  52,952కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోగా, ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలావుండగా, బుధవారం తెలంగాణాలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. 
 
వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 430. ఈరోజు 20 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 648కి పెరిగింది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments