దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 52,050 కేసులు.. 803 మంది మృతి

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (10:17 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,050 కేసులు నమోదు కాగా, 803 మంది ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 44,306 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 18,55,745 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,86,298 ఉండగా, 12,30,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,938 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 66.31 శాతంగా ఉంది. 
 
ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 15,700 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. నిత్యం అక్కడ 250కిపైగా కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
తమిళనాడు, ఢిల్లీలలో ఇప్పటివరకూ 4వేల చొప్పున కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ 2500చొప్పున కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో కొవిడ్‌ కేసుల్లో భారత్‌ మూడోస్థానంలో ఉండగా, మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments