కరోనా పాపం చైనాదే.. కాలిఫోర్నియా పరిశోధనలో వెల్లడి

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (20:22 IST)
Corona
కరోనా పాపం చైనాదేనని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం తేలింది. ఈ వైరస్‌ను చైనాలోని వూహన్‌లో తొలిసారి 2019 డిసెంబరు చివరిలో గుర్తించగా, నిజానికి ఇది 2019 అక్టోబరు నుంచే వ్యాప్తిలో ఉందని తెలిపింది. అధికారికంగా గుర్తించేందుకు ముందు రెండు నెలలపాటు కరోనా వైరస్ చైనాలో వ్యాప్తిలో ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
 
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌ ప్రచురించింది. మాలెక్యులార్ డేటింగ్ టూల్స్‌ను, ఎపిడమియలాజికల్ సిమ్యులేషన్స్‌ను ఉపయోగించి ఈ వైరస్ ప్రారంభమైన తేదీని నిర్థారించినట్లు ఈ నివేదిక పేర్కొంది.
 
ఈ అధ్యయనంలో పాల్గొన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ జోయెల్ ఓ వర్థీమ్ మాట్లాడుతూ, సార్స్-కోవ్-2ను అధికారికంగా గుర్తించడానికి ముందు అది ఎంత కాలంపాటు చైనాలో వ్యాప్తిలో ఉందో తెలుసుకోవడం కోసం అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం మూడు ముఖ్యాంశాలను పరిశీలించామన్నారు. 
 
వీటిని పరిశీలించిన తర్వాత సార్స్-కోవ్-2 మొదట హుబేయి ప్రావిన్స్‌లో 2019 అక్టోబరు 15 తర్వాత ప్రారంభమైందని చెప్పేందుకు ఆధారాలను గుర్తించామని తెలిపారు. సెంట్రల్ చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఉన్న వూహన్‌లో 2019 డిసెంబరు చివర్లో మొదటి కోవిడ్-19 కేసును అధికారికంగా గుర్తించారని చెప్పారు.
 
జీవాణువుల మార్పు రేటు ఆధారంగా గతంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ జీవ రూపాలు వేరుపడిన సమయాన్ని తెలుసుకునే పద్ధతిని మాలెక్యులార్ క్లాక్ అంటారని ఈ అధ్యయనం కో-ఆథర్, అరిజోనా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మైఖేల్ వోరోబీ చెప్పారు. 
 
ఈ పరిశోధన ఆధారంగా చైనాలో 2019 నవంబరు 4 వరకు సార్స్-కోవ్-2 సోకినవారి సంఖ్య కనీసం ఒకటి కన్నా తక్కువే ఉండవచ్చునని తేలిందన్నారు. 13 రోజుల తర్వాత ఈ వైరస్ సోకినవారు కనీసం నలుగురు ఉండే అవకాశం ఉందని, 2019 డిసెంబరు 1నాటికి తొమ్మిది మందికి సోకి ఉండవచ్చునని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్-19గా పిలుస్తున్న వ్యాధి లక్షణాలుగల ఓ వ్యక్తి వూహన్‌లో 2019 డిసెంబరు మధ్య కాలంలో ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించిన మొదటి కేసు ఇదేనని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments