Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:54 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజురు పెరిగి పోతున్నాయి. లాక్డౌన్ సడలింపు కారణంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా 553 మంది కరోనా వ్యాధితో మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరింది.
 
అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా 5,71,460 మంది చకిత్స నిమిత్తం కోలుకోవడం జరిగింది. అటు కరోనాతో పోరాడి 23,727 మంది మృతి చెందారు. జూలై 13 వరకు దేశవ్యాప్తంగా 1,20,92,503 శాంపిల్ టెస్టు చేసారు. నిన్న ఒక్క రోజే 2,86,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో కరోనా వైరస్ రికవరీ రేటు 63.2 శాతానికి పెరిగింది.
 
జులై 6-12 తేదీల మధ్య 1.83 లక్షల కేసులు, 3466 మరణాలు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రాల వారీగా కరోనా కేసులు పరిశీలించగా ఆంధ్రప్రదేశ్ 1935, ఉత్తర ప్రదేశ్ 1664, తెలంగాణ 1550, గుజరాత్ 902, మధ్యప్రదేశ్ 575, పంజాబ్ 357, చత్తీస్గడ్ 184. ఈ రాష్ట్రాలలో గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
 
దేశం మొత్తంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. సోమవారం అక్కడ కొత్తగా 6,497 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. ప్రస్తుతం డిల్లీలో కూడా అదే పరిస్థితి సోమవారం 1,246 కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకాలో 2,738, తమిళనాడులో4000 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments