Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. తెలంగాణలో ఎన్ని.. ఏపీలో కరోనా ఫ్రీగా జిల్లాలు..?

Corona
Webdunia
గురువారం, 15 జులై 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వం విధించిన కర్ప్యూ సత్ఫలితాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని జిల్లాలు కరోనా ఫ్రీ దిశగా సాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,204 శాంపుల్స్ ని పరీక్షించగా 2,591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 69, చిత్తూరు జిల్లాలో 349, తూర్పుగోదావరి జిల్లాలో 511, గుంటూరు జిల్లాలో 219, కడప జిల్లాలో 217, కృష్ణాజిల్లాలో 190, కర్నూలు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 251, శ్రీకాకుళం జిల్లాలో 62, విశాఖపట్నం జిల్లాలో 220, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 266 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో 15 మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 13,057కి చేరింది. 
 
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, గత 24 గంటల్లో నమోదైన కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కుపైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,15,237 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 749 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
 
తాజాగా, నమోదైన 749 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,33,895కు చేరింది. కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3743కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments