తెలంగాణాలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు.. జగిత్యాలలో కలకలం

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (22:32 IST)
తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు ఉండటం ఇపుడు హైదరాబాద్ నగర వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో 19 మంది వలస కూలీలకు, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. అలాగే శుక్రవారం ముగ్గురు చనిపోగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులు 48కి చేరాయి. మరో ఏడుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మరో 670 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, జగిత్యాలలో కలకలం రేగింది. ఈ జిల్లాలో తొమ్మిది మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈ తొమ్మిది మంది వలస కూలీలు ముంబై నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో ఈ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33కి చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments