Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు - ముంబైలో 24 గంటల్లో ఎన్ని కేసులంటే?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (21:07 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతవారం రోజులుగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 52 కేసులు నమోదు కాగా, తాజాగా గత 24 గంటల్లో మరో 37 కేసులు వెలుగుచూశాయి. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 681కి పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం బాధితుల్లో 118 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఆసుపత్రుల్లో ఇంకా 545 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 
 
అలాగే, కరోనా వైరస్ మహమ్మారి ముంబైని భయపెడుతోంది. అత్యధిక మంది బాధితులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, అందులో సగం కేసులు రాజధాని ముంబైలోనే నమోదవుతుండటం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 183 కేసులు నమోదయ్యాయి. అలాగే, నగరానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ముంబైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1936కు పెరిగినట్టు బీఎంసీ తెలిపింది. ఇప్పటివరకు నగరంలో 113 మంది ప్రాణాలు కోల్పోగా, 181 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments