Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని..?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:50 IST)
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో డోస్ వ్యాక్సిన్ అందిస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రధాన మంత్రి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితమని..  ప్రైవేట్‌లో 250 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు వారికి విజ్ఞప్తి చేశారు. 
 
ప్రస్తుతం 10 వేల ఫ్రీ వాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని... వాటిని 20వేలకు పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments