Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో వారణాసికి రావొద్దు.. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ చూపిస్తేనే..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న మూడు సుప్రసిద్ధ దేవాలయాలకు ఏప్రిల్‌లో రావాలనుకునే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది. కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్నందువల్ల ఈ సలహా ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మాట్లాడుతూ, కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ మునుపెన్నడూ లేనంత అదికంగా నమోదవుతున్నాయన్నారు. ఈ నెలలో వారణాసిలోని దేవాలయాలను సందర్శించేందుకు రావాలనుకుంటున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. దేశీయ, అంతర్జాతీయ భక్తులు ఏప్రిల్‌లో వారణాసికి రావద్దని కోరారు.
 
వారణాసి డివిజినల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ, విశ్వనాథ్ దేవాలయం, సంకట మోచన దేవాలయం, అన్నపూర్ణ దేవాలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించాలని చెప్పారు. వారణాసిలో ప్రవేశించడానికి ముందు మూడు రోజుల్లో ఈ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలని చెప్పారు. నగరంలోని హోటళ్ళకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments