Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కొత్తగా 80,472 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:06 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నది. దీనికితోడు వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 62 లక్షల 25,000 దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 80,472 కేసులు నమోదు కాగా 1179 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,428 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 62,25,764 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 9,40,441 ఉండగా 51,87,826 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
97,497మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.57 శాతానికి తగ్గిన మరణాలరేటు. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.11గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,86,688 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహంచారు. కాగా ఇప్పటి వరకు దేశంలో 7,41,96,729 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments