ఏపీలో రేసుగుర్రంలా కరోనావైరస్, 24 గంటల్లో 10,601 కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:27 IST)
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజూ పదివేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,601 కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది.

ఇవాళ 73 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 4,560కి చేరుకుంది. ప్రస్తుతం 96,769 మంది కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటి వరకు 4,15,765 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 70,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 42,37,070 కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments