Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉధృతంగానే కరోనా వైరస్... మరో 10 వేల కేసులు

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా మరో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 71,692 నమూనాలు పరీక్షించగా 10,418 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కి చేరింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మృత్యువాతపడగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,634కి పెరిగింది. తాజాగా 9,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా ఇప్పటివరకు 4,25,607 మందికి కరోనా నయం అయింది. ఇంకా, 97,271 మందికి చికిత్స కొనసాగుతోంది.
 
దేశంలో 43 లక్షల పాజిటివ్ కేసులు 
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 43,70,129కు చేరింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 89,706 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదేసమయంలో 1,115 మంది మృతి చెందారు. 
 
వీటితో కలుపుకుంటే.. మృతుల సంఖ్య మొత్తం 73,890కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది కోలుకున్నారు. 8,97,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 5,18,04,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,54,549 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,479 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు పెరిగింది. 
 
మంగళవారం ఒక్క రోజే కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 916కు పెరిగింది. గత 24 గంటల్లో 62,649 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 18,90,554కు పెరిగింది.
 
ఇక, ఇప్పటివరకు 1,15,072 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,485 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 31,654 కేసులు యాక్టివ్‌గా ఉండగా, హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో 24,471 మంది ఉన్నట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments