Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నిదానిస్తున్న కరోనా వ్యాప్తి

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా నిదానిస్తోంది. వేసవిలో కనిపించిన ఉద్ధృతి ఇప్పుడు లేదనే చెప్పాలి. తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
అదేసమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు. 
 
తెలంగాణాలో గణనీయంగా తగ్గుదల!  
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు దాటిపోయింది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. 
 
కాగా, దేశంలో గత 24 గంటల్లో 55,722 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,50,273కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 579 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,610 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 66,63,608 మంది కోలుకున్నారు. 7,72,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,50,83,976 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులోనే 8,59,786 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 948 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన 212 కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రిలీజ్ చేసిన బులెటిన్ విడుదల చేసింది.
 
తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,23,059కి పెరిగింది. మహమ్మారి కారణంగా ఆదివారం నలుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,275కు పెరిగింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 21,091 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1,896 మంది కరోనా కోరల నుంచి బయటపడడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,00,686కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments