ఆఫీసుకు వచ్చిన కరోనా ఉద్యోగి.. కార్యాలయంలో ఏడుగురు మృతి

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (15:51 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో గత ఏడాది మార్చి నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయాలు మూతపడ్డాయి. కానీ ఇప్పుడిప్పుడే అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో యధావిధిగా ఉద్యోగోలు విధులకు హాజరవుతున్నారు. 
 
అయితే అన్ లాక్ ప్రక్రియ కొనసాగినా.. కరోనా వ్యాప్తికి మాత్రం ఇంకా బ్రేక్ పడలేదు. కరోనా మృతుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టలేదు. కరోనా లక్షణాలున్న ఒక  వ్యక్తి కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆఫీస్‌లోని కొందరికి వైరస్‌ సోకడంతో ఏడుగురు మరణించారు. 
 
క్వారంటైన్‌లో ఉన్న సుమారు 300 మంది ప్రాణ భయంతో హడలిపోతున్నారు. అయితే ఈ ఘటన మనదేశంలో కాదు. అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. డగ్లస్ కౌంటీకి చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ గత వారం ఆఫీస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో అతడ్ని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
మరోవైపు అతడి ద్వారా మరికొందరికి వైరస్‌ వ్యాపించింది. ఈ క్రమంలో కరోనాబారినపడి ఏడుగురు మరణించారు. దీంతో డగ్లస్‌ కౌంటీలోని సుమారు 300 మందికిపైగా ప్రజలు స్వీయ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 37 మంది కరోనా వల్ల మరణించగా 1,315 మందికి వైరస్‌ సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments