Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కొత్త అవతారం : భారత్‌లో 'కప్పా వేరియంట్'

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (18:24 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ తన రూపాన్ని మార్చుకుంటుంది. తాజాగా సరికొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ మ్యూటెంట్‌ ఆందోళన కలిగిస్తుండగా.. తాజాగా ఈ మహమ్మారి మరో కొత్త అవతారం ఎత్తింది. కరోనా మహమ్మారి ఇప్పుడు ‘కప్పా వేరియంట్’ రూపంలో భయాందోళన కలిస్తోంది. 
 
భారత్‌లో రెండు కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గుర్తించారు. కప్పా వేరియంట్‌ కరోనా వైరస్ సోకడంతో ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రిలో చేరినట్లు లక్నోలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాల, ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. వైరస్ జీనోమ్ సీక్వెన్స్‌ను పరీక్షించిన తరువాత దీన్ని ధృవీకరించినట్లు చెప్పారు. 
 
ఇప్పటిదాకా వెలుగులోకి రాని కొత్త మ్యూటెంట్‌గా వైరస్ ఆవిర్భవించినట్లు గుర్తించామని అన్నారు. సాధారణ కరోనా వైరస్ వ్యాప్తితో పోల్చుకుంటే.. దీని వేగం మరింత అధికంగా ఉంటుందని చెప్పారు. 107 మందికి చెదిన డెల్టా ప్లస్ బాధితుల నమూనాలను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ బయటపడింది. 
 
కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలియజేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ తరహా వేరియంట్ కేసులు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments