తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది గడిచింది..

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:57 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. గత ఏడాది తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి అయ్యింది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటినీ చిగురుటాకులా వణికించింది కరోనా వైరస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2న కరోనా తొలి కేసు నమోదైంది. అంటే నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత కేసుల సంఖ్య వేలల్లో, లక్షల్లో పెరిగింది. 
 
ముఖ్యంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం పాటించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే వచ్చేది. ఆ తర్వాత అక్టోబర్‌, నవంబర్ నుంచి కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆంక్షలు ఎత్తివేసింది. అన్‌లాక్‌ ప్రక్రియతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరింది.
 
ఇక డిసెంబర్‌లో కొత్త స్ట్రెయిన్‌, కరోనా సెకండ్‌ వేవ్‌ అని హెచ్చరించినా తెలంగాణలో వాటి ప్రభావం కనిపించలేదు. కరోనా తగ్గిపోయింది రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోయింది. మనకేం కాదులే అన్న ధీమాతో చాలా మంది మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం మానేశారు. 
 
మరోవైపు కొవిడ్‌ టీకా కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రజలు వైరస్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం మొదలైంది. జనవరిలో తెలంగాణలో 4వేల 79 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఫిబ్రవరి వచ్చే సరికి ఆ సంఖ్య 8వేల 29కి పెరిగింది.
 
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2లక్షల 98వేల 923 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఒక వేయి 634 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

తర్వాతి కథనం
Show comments