Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్చకులను కష్టపెట్టాలన్న ఉద్దేశ్యం లేదు... 743 మందికి కరోనా : తితిదే

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (09:33 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో విధులు నిర్వహించడం అర్చకులకు ఇపుడు కత్తిమీద సాములా మారింది. కరోనా వైరస్ సోకి ఇప్పటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మిగిలిన అర్చకుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అర్చక పనులు చేయడానికి పూజాకులు వెనుకంజ వేస్తున్నారు. 
 
దీనిపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు తమతో చర్చించలేదన్నారు. అర్చకులు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. 
 
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న అర్చకుల్లో చాలా మంది ఆలయ విధులకు హాజరవుతున్నారని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్చకులకు తిరుమలలో విధులు ఇవ్వవద్దని ప్రధాన అర్చకులకు చెప్పామని ఈవో వెల్లడించారు. దర్శనాల కోసం అర్చకులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఆలోచన టీటీడీకి లేదని స్పష్టం చేశారు.
 
ఇకపోతే, తిరుమల క్షేత్రంలో కరోనా గురించి చెబుతూ, ఇప్పటివరకు 743 మందికి కరోనా సోకినట్టు తేలిందని, వారిలో 400 మంది కోలుకున్నారని తెలిపారు. ఐదుగురు టీటీడీ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించారని సింఘాల్ వివరించారు. తిరుమల కొండపై కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నిరంతర తనిఖీలు, పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments