Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణాలో???

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (11:06 IST)
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 47,638 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,11,724 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 55,331 మంది కోలుకున్నారు.
 
అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 670 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,24,985 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 77,65,966 మంది కోలుకున్నారు. 5,20,773 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
అలాగే, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,602 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 982 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,47,284 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,26,464 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1366కి చేరింది. 
 
ప్రస్తుతం 19,272 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,522 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 118 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments