Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశా: 26 మందికి పైగా టీచర్లు, విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (20:42 IST)
కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు ఒడిశాలో జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలో 30 మందికిపైగా టీచర్లు, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలోని గజపతి జిల్లాలో గత మూడు రోజుల్లో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. అందులో 90 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యార్థులే ఉన్నారన్నారు. స్కూళ్లకు వెళ్లడంతో వీరికి కరోనా వైరస్‌ సోకిందని చెప్పారు.
 
ఒడిశాలో 10, 12వ తరగతి విద్యార్థులకు శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే విద్యా సంస్థల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. 
 
కాగా, బోర్డు పరీక్షల దృష్ట్యా నిరాటంకంగా వంద రోజులపాటు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈనేపథ్యంలో తల్లిదండ్రుల అనుమతితో తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు తరగతులకు హాజరుకాలని ప్రభుత్వం సూచించింది. కాగా, రాష్ట్రంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈరోజునుంచి చివరి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments