Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. 229 మంది హాస్టల్ విద్యార్థులకు పాజివిట్

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (13:19 IST)
మహారాష్ట్రను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని ఏరియాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ, కొత్త కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇదిలావుంటే, గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
అయితే, కరోనా తగ్గుతోందన్న కారణంగా ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. వాటితోపాటే హాస్టళ్లూ తెరుచుకున్నాయి. ఎక్కడ తేడా కొట్టిందో గానీ.. 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ హాస్టల్ లో 200 మందికిపైగా కరోనా సోకి కలకలం రేపింది.
 
వాషిం జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థులు, సిబ్బంది సహా 232 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
 
పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందులోనూ ఒక్క అమరావతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments