Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్.. ఒమిక్రాన్ టెన్షన్‌

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:30 IST)
Hyderabad
హైదరాబాదులో 13 మందికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన వారిలో 13 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 13 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

 
పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే వారికి సోకిన కరోనా వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉంది. రిపోర్ట్స్ వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు.

 
విదేశాల నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో ఉంచారు. ఆమె నుంచి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఆమెకు సోకింది కరోనా డెల్టా వేరియంటా.. లేక ఒమిక్రాన్ వేరియంట్ అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments