వంటింటి చిట్కాలు : ఉప్మా దించేముందు గడ్డ పెరుగును కలిపితే?

కేకు చేసే మిశ్రమంలో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ చేర్చితే.. కేక్‌లను మృదువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే పాలు మరిగించిన పాత్రలో చపాతీ పిండిని సిద్ధం చేసుకుంటే చపాతీలు మృదువుగా వుంటాయి. నూనె చేర్చాల్సిన పనివుండ

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (14:52 IST)
కేకు చేసే మిశ్రమంలో అరకప్పు ఆరెంజ్ జ్యూస్ చేర్చితే.. కేక్‌లను మృదువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే పాలు మరిగించిన పాత్రలో చపాతీ పిండిని సిద్ధం చేసుకుంటే చపాతీలు మృదువుగా వుంటాయి. నూనె చేర్చాల్సిన పనివుండదు. అలాగే నెయ్యి కాచిన పాత్రలో రసం, వడియాలు వేయించిన బాణలిలో పులుసు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. 
 
టమోటా సూప్ తయారు చేసిన వెంటనే అర గంటలోపు తీసుకోవాలి. చాలాసేపటికి తర్వాత తీసుకోకూడదు. అందులో ఆమ్లాలు చేరిపోతాయి. అలా ఆమ్లాలు చేరకుండా వుండాలంటే.. గోరువెచ్చగా వున్నప్పుడే సూప్‌తో చిటికెడు వంట సోడాను కలిపి వుంచాలి. 
 
అలాగే రవ్వతో ఉప్మా తయారు చేశాక.. దించేందుకు ముందు పావు కప్పు గడ్డ పెరుగును చేర్చితే ఉప్మా టేస్ట్ అదిరిపోతుంది. పుల్లటి పెరుగును వృధా చేయకుండా ఒక కప్పు పెరుగులో, ఒక కప్పు రవ్వ, అల్లం తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర చేర్చి ఐదు నిమిషాల పాటు నానబెట్టి వడల్లా చేసుకోవచ్చు. 
 
క్యారెట్, బీట్ రూట్ తరుగును సమపాళ్లలో తీసుకుని నెయ్యి చేర్చి, బెల్లం కలిపి హల్వాలా చేసుకుని తింటే విటమిన్లు, ఐరన్ పుష్కలంగా లభించినట్లవుతుంది. టీ-పొడి కాసేపు ఎండలో వుంచి టీ తయారు చేస్తే రుచి పెరుగుతుంది. రెండోసారి బియ్యం కడిగిన నీటిలో కంది పప్పును ఉడికించి సాంబార్ చేస్తే రుచిగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ధర్ భోజ్‌శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...

ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments