Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పుడు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా?

ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:45 IST)
ఉప్పుడు బియ్యాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. వడ్లని చెరిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి. పైన తేలిన పొట్టును తీసివేయాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని బుట్టలో పోసి వడపొయ్యాలి. 16 లీటర్ల వడ్లకి 20 లీటర్ల నీరు పట్టే గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో 2 లీటర్ల నీరు వేడిచేసుకోవాలి.
 
ఇప్పుడు ఆ నీటి గిన్నెమీద మూతపెట్టుకోవాలి. మంట ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నెలోంచి ఆవిరి వస్తుంటుంది, అప్పుడు కఱ్ఱ గరిటతో లేదా పొడవుగావున్న గరిటతో ఆ బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. మళ్లీ తిరిగి మూత పెట్టుకోవాలి. ఈ వడ్లు విడిపోయే వరకు వాటిని ఉడికించుకోవాలి. ఆ తరువాత బుట్టలో పోసుకుని వడగట్టి ఆ నీటిని పారేయాలి. వీటిని రెండుమూడు రోజుల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి.
 
ఆ తరువాత వాటిని ఇంట్లోగానీ, మిల్లులో గానీ పట్టించుకుని పొట్టు చెరిగేసుకోవాలి. ఒకవేళ రెండురోజుల తరువాత కూడా వడ్లు బాగా ఎండకపోతే మళ్లీ ఒక రోజంతా వాటిని మూడు గంటల పాటు అలానే ఉంచుకోవాలి. తరువాత ఎండలో బాగా ఎండపెట్టుకుని పొట్టును చెరుక్కోవాలి. ఇలా చేయడం వలం ఉప్పుడు బియ్యం చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments