Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసిపోతున్నారా? దాల్చిన చెక్క, తేనె మిశ్రమాన్ని ట్రై చేయండి..

పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ హడావుడిగా ఏదో పనిలో మునిగిపోయి.. బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఆరోగ్యం పట్ల మహిళలు అంతగా శ్రద్ధ తీసుకోవట్లేదు. దీంతో

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (12:12 IST)
పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ హడావుడిగా ఏదో పనిలో మునిగిపోయి.. బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఆరోగ్యం పట్ల మహిళలు అంతగా శ్రద్ధ తీసుకోవట్లేదు. దీంతో ఒబిసిటీతో పాటు పలు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మహిళలు నిత్యం ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనులను నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. ఉదయం ఎంత హుషారుగా వుంటారో సాయంత్రానికి అంతకంటే ఎక్కువగానే నీరసించిపోతారు. 
 
ఇందుకు కారణం వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గిపోవడమే. ఇలా నీరసం.. అలసటను దూరం చేసుకోవాలంటే.. పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఆ శక్తిని పెంచుకోవచ్చు. వీటికంటే.. తేనె, దాల్చిన చెక్క ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్‌తో రెమెడీ చేసుకుని తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణు  సూచిస్తున్నారు. 
 
దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. అలాగే.. రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు అలసటను దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments