Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతితో వంకాయ వేపుడు ఎలా?

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (22:07 IST)
brinjal
వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాంటి వంకాయను నేతితో వేపుడులా చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. 
 
కావాల్సిన పదార్థాలు:
వంకాయలు-పావు కేజీ
ఆవాలు- ఒక స్పూన్
జీలకర్ర-అర స్పూన్
ఎండు మిర్చి- 2
పచ్చి మిర్చి- 1
ఆయిల్‌, నెయ్యి - చెరో రెండు స్పూన్లు 
కొత్తి మీర, కరివేపాకు -తగినంత 
ధనియాల పొడి, జీలకర్ర పొడి - చెరోస్పూన్
కారం, పసుపు, ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: స్టవ్ మీద బాణలి పెట్టి వేడయ్యాక.. అందులో కొద్దిగా ఆయిల్‌, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. కట్‌ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. 
 
బాగా వేగాక ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉప్పు, కారం, పసుపు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. అంతే నేతితో చేసిన వంకాయల వేపుడు రెడీ.. దించే ముందు కొత్తిమిర తరుగు వేసుకోవాలి. ఈ నేతి వంకాయ వేపుడు వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ, పుల్కాలకు సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమోన్మాది దాడి.. కత్తితో దాడి.. యువతి మృతి.. ఆపై విద్యుత్‌ స్తంభం ఎక్కాడు?

పెళ్లి విందులో మటన్ ముక్క కోసం తలలు పగులకొట్టుకున్నారు..

రుషికొండలో ప్యాలెస్ కట్టాల్సిన అవసరం ఏముంది?: నారా లోకేష్

రాజీనామాకు అనేక కారణాలు ఉన్నాయ్... మోపిదేవి వెంకట రమణ

జగన్‌ను ఆర్కే రోజా అన్‌ఫాలో కాలేదు.. జగన్‌ను ఇప్పటికీ అన్నగానే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జస్టిస్‌ హేమ కమిటీ ప‌నితీరు భేష్.. మెచ్చుకున్న సమంత

పడక సుఖం ఇవ్వాలని కోరే వారిని చెప్పుతో కొట్టండి : హీరో విశాల్ పిలుపు

క్రైమ్ థ్రిల్లర్ ‘ఎన్.ఈ.ఎస్.టి’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

తమన్నాతో నా రిలేషన్ నిజమే.. నా వద్ద 5వేల ఫోటోలున్నాయ్?

పురుషులకు నేను చెప్పేది ఒక్కటే.. హేమ కమిటీతో మార్పు రావాలి: ఖుష్భూ సుందర్

తర్వాతి కథనం
Show comments