Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం-చిట్కాలు... అదిరిపోయే టేస్ట్ గ్యారెంటీ

ఉదయం పూట అల్పాహారం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ క్రింది చిట్కాలను ఒకసారి చూడండి. 1. ముదిరిపోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. 2. అరకిలో చపాతి పిండికి రెండు మగ్గిన అరటి పండ్లు, ఒక కప్పు పెరుగు చొ

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (16:41 IST)
ఉదయం పూట అల్పాహారం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ క్రింది చిట్కాలను ఒకసారి చూడండి.

1. ముదిరిపోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
 
2. అరకిలో చపాతి పిండికి రెండు మగ్గిన అరటి పండ్లు, ఒక కప్పు పెరుగు చొప్పున కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి.
 
3. మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగా పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే భలే రుచి. అయితే వడియాలను చీరల మీద, చాపల మీద కాకుండా ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ మీద కాని పాలిథీన్ పేపర్ మీద కాని పెడితే ఎండాక తీసుకోవటం చాలా తేలిక.
 
4. పూరీలు చేసేందుకు పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే చాలాసేపటి వరకు తాజాగా ఉంటాయి.
 
5. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు రెండు ఆముదం చుక్కలు వేసి రుబ్బితే ఇడ్లీ మెత్తగా వస్తుంది.
 
6. నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కల మీద మెత్తని ఉప్పు వేసి బాగా కలిపితే అవి తడి అవుతాయి. వాటిని కొంచెం శనగ పిండితో కలిపి వేయించుకుంటే పకోడీలు కరకరలాడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments