గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే నెలకు బదులు రెండు నెలలు వస్తుంది...

తరిగిపోతున్న సహజవనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి సహజవనరుల కిందకు వస్తాయి. వీటిలో మనం వాడే దానిలో వంట గ్యాస్ ముఖ్యమైనది. చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ను ఆదా చేయొచ్చు.

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (19:58 IST)
తరిగిపోతున్న సహజవనరులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటివి సహజవనరుల కిందకు వస్తాయి. వీటిలో మనం వాడే దానిలో వంట గ్యాస్ ముఖ్యమైనది. చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ను ఆదా చేయొచ్చు. 
 
చాలామంది వంట చేయడానికి ఎక్కువ గ్యాస్‌ను వృధా చేస్తూ ఉంటారు. దీంతో గ్యాస్ అయిపోవడం, తిరిగి రీఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోలెడు ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతూ ఉంటుంది. స్టౌవ్‌ను వెలిగించే ముందు వంటకు కావాల్సిన వస్తువులన్నింటిని దగ్గరగా ఉంచుకోవాలి. వంట చేస్తున్న పాత్రలపై మూత పెట్టాలి. ప్రెషర్ కుక్కర్‌ను వినియోగిస్తే మేలు. ఫ్రిజ్‌లో నుంచి తీసిన పదార్థాలను వెంటనే పొయ్యిపై వినియోగించకూడదు. పప్పు దినుసులు బియ్యం వంటకు ముందే నానబెట్టుకుంటే మంచిది. 
 
వండే పాత్ర భాగం వెడల్పుగా ఉంటే మంచిది. తరచూ స్టౌ బర్నల్‌ను శుభ్రం చేయించాలి. బీటలు వారిన పైపులను వాడకూడదు. గాలి వీచే ప్రాంతంలో అస్సలు వంట చేయకూడదు. వంట పూర్తయ్యేవరకు పొయ్యి దగ్గరే ఉండాలి. బర్నర్ పైన పొంగు పడకుండా చూసుకోవాలి. ఇలాంటివి చేస్తే నెలరోజుల పాటు వచ్చే మీ గ్యాస్ రెండు నెలలు ఖచ్చితంగా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులాపై దాడి: ట్రంప్ చేసింది చాలా బాగోలేదు, ప్రపంచ దేశాలు అసంతృప్తి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments