Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండు తొక్కతో దంతాలను రుద్దుకుంటే?

దంతాలను మెరిసేలా చేసే వంటింటి చిట్కాలు. అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలను రెండు నిమిషాల పాటు రుద్దుకుంటే బాగా మెరుస్తాయి. అరటిపండు తొక్కలోని పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు దంతాల

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (16:33 IST)
దంతాలను మెరిసేలా చేసే వంటింటి చిట్కాలు. అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలను రెండు నిమిషాల పాటు రుద్దుకుంటే బాగా మెరుస్తాయి. అరటిపండు తొక్కలోని పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు దంతాల్లోకి ఇంకడం వలన వాటికి ఆ మెరుపువస్తుంది. స్ట్రాబెర్రీ లేదా స్ట్రాబెరీ టూత్‌పేస్ట్‌తో దంతాలు శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
పాల ఉత్పత్తులు దంతాలు రంగు తగ్గడాన్ని నిరోధిస్తాయి. యాపిల్స్, క్యారెట్స్, అకుకూరలు దంతాలపై ఉన్న మచ్చలను పోగొట్టే ఆర్గానిక్ టీత్ స్టెయిన్ రిమూవర్స్. టీ, కాఫీ తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వలన దంతాలపై వాటి ప్రత్యక్ష ప్రభావం పడదు. ఫలితంగా దంతాలపై మచ్చలు పడకుండా ఉంటాయి. బేకింగ్ సోడాతో చేసిన లిక్విడ్ పేస్ట్‌ను వాడడం వలన దంతాలు తళతళ మెరుస్తాయి. 
 
తిన్న తరువాత నీటితో నోటిని బాగా పుక్కిలిస్తే కూడా దంతాలపై మచ్చలు పడవు. తులసి ఆకులు, కమలాపండు తొక్కు రెండింటిని మిశ్రమంలా చేసుకుని దంతాలపై రుద్దుకుంటే కూడా దంతాలు తెల్లగా మారతాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని దంతాలపై రుద్దితే కూడా దంతాలు తెల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments